27-12-2025 12:00:00 AM
డిచ్‌పల్లి, డిసెంబర్26 (విజయ క్రాంతి): ప్రగతిశీల యువజన సంఘం నిజామాబాద్ నగర జనరల్ బాడీ సమావేశం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నవీన్ కుమార్ మాట్లాడుతూ పాలకులు యువతను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా పాలక పార్టీలకు బానిసలుగా మార్చే కుట్రలు చేస్తున్నారన్నారు.
సిగరెట్లు, గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలకు వనరులుగా మారుస్తున్నారన్నారని ఆరోపించారు. ఈసీ మనీ కోసం యువత బెట్టింగులు వైపు ఆలోచించడం బాధాకరమన్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా భగత్ సింగ్, అల్లూరి ల స్ఫూర్తితో పోరాడాలన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పాలకవర్గాలను ప్రశ్నించాలన్నారు. ప్రజల ధైనందిన సమస్యలపై పోరాడాలన్నారు. అనంతరం నగర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన కార్యవర్గంతో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబా ప్రతిజ్ఞ చేయించారు.
ప్రగతిశీల యువజన సంఘం నగర కమిటీ..
అధ్యక్షులుగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా శాంతికుమార్ ఉపాధ్యక్షులుగా శ్రీధర్, విటల్ సహాయ కార్యదర్శులుగా రాజు, రాము కోశాధికారిగా లింగం మరియు కార్యవర్గ సభ్యులుగా రమేష్ చారి, సాయికుమార్, గంగాధర్, నవీన్, కిరణ్, రవి ఎన్నికయ్యారు.