calender_icon.png 14 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ హక్కులూ, గుర్తింపు దోచేస్తున్నారు

14-08-2025 01:16:56 AM

ఓట్ చోరీపై కల్పిత వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ‘ఓట్ చోరీ’పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం ఎక్స్‌లో ఓ కల్పిత వీడియోను ఆయన షేర్ చేశారు. ‘మీ హక్కులు, అధికారాలు, మీ గుర్తింపును కూడా చోరీ చేస్తున్నారు’ అని  వీడియోకు జత చేశారు. ఓట్ చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ బీజేపీ, ఎన్నికల సంఘంపై వరుసగా ఆరోపణలు చేస్తూనే ఉంది. 

పౌరసత్వం లేకున్నా ఓటరు జాబితాలో సోనియా పేరు

ఓట్ చోరీ ఆరోపణలను బీజేపీ పార్టీ తిప్పి కొడుతోంది. ఎన్నికల్లో అవకతవకల గురించి భారీ ప్రసంగాలు చేస్తూ, నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ గతంలో ఎన్నో మోసాలకు పాల్పడిందని బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ‘భారత పౌరసత్వం పొందడానికి మూడేండ్ల ముందే ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరుంది. అప్పటికీ ఆమె ఇటలీకి చెందిన వ్యక్తి. ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవడంతో పేరును తొలగించారు. ఈ విధంగా కాంగ్రెస్ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.