calender_icon.png 29 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కోసం యువత పరుగులు

29-11-2025 12:26:30 AM

మోతె, నవంబర్ 28:- మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి గ్రామంలో గ్రామ సర్పం లుగా, వార్డు సభ్యలుగా రిజర్వేషన్ ల వారీగా అవకాశం వచ్చిందని ఎవరికీ వారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా యువత ధ్రువీకరణ పత్రాల కోసం సంబంధిత కార్యాలయాలు చుట్టూ పరుగులు తీస్తున్నారు.

కుల, ఆదాయ, ఇంటి పన్నులు, నో డ్యూస్, నో అబ్జాక్షన్  సర్టిఫికెట్, 4 పాస్ ఫోటోలు, బ్యాంకు ఏకౌంట్, వయస్సు ధ్రువీకరణ కోసం విద్యారత సర్టిఫికెట్ లు,  ఓటర్ లిస్ట్ ను సిద్ధం చేసుకోవడంలో యువత తలమునకలయ్యారు. ఈ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ, తాసీల్దార్ కార్యాలయాల వద్ద ఆశావహులు బారులు తీరుతున్నారు. మొత్తానికి గ్రామాలలో రాజకీయం వేడెక్కింది. కొందరైతే పార్టీలకు అతీతంగా క్యాంపులు నిర్వహిస్తున్నారు.

నామినేషన్ రెండు రోజులు ఉండగానే కొందరు ప్రతి ఇంటికి మద్యంను అందజేస్తున్నట్లు తెలుస్తుంది. మరి కొందరు పార్టీల అధిష్టానం మేరకు పోటీకి సిద్ధం అవుతుండగా, యువత మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండెందుకు సిద్ధం అవుతున్నారు. రేపటి నుంచి ఎన్నికల జోరు ఏలా రక్తి కట్టించనుందో చూడాలి మరి.