calender_icon.png 29 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధినిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

29-11-2025 12:28:12 AM

- పోలీసులు భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి

-కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బోధన

-జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

మర్రిగూడ, నవంబర్ 28 (విజయక్రాంతి): ఎన్నికల నిర్వహణలో అధికారులు విధి నిర్వహణలోఎలాంటి అవక అవకలకు, నిర్లక్ష్యానికి గురికాకుండా సమయ పాలన పాటించి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మర్రిగూడ మండలంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆమె శుక్రవారం సందర్శించి మాట్లాడారు. సారంపేట ,శివన్నగూడ, మర్రిగూడ లోని గ్రామపంచాయతీల సర్పంచి, వాడు సభ్యుల కేంద్రాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ర్ట ప్రభుత్వ సూచనల మేరకు, ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించి గ్రామాల్లో శాంతియుతంగా సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తయ్యేందుకు తొలి నుండి చివరి వరకు అధికారులే బాధ్యత వహించేందుకు కృషి చేయాలని ఆమె హెచ్చరించారు. పోలీసులు భద్రత విషయంలో అవసరమైతే సిబ్బందిని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె సూచనలు చేశారు.

అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులకు కనీసం అరగంట పైగా బోధనలు చేసి, పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను ఆవరణలో ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ స్కూల్ ఎలా ఉంది అని విద్యాభ్యాసం ఎలా ఉందని ప్రతి ఒక్క విద్యార్థినినీ వివరాలను అడిగి తెలుసుకోవడంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యా బోధనపై పలువురు ప్రశంసలు కురిపించడం పట్ల కోసమెరుపు. ఈ కార్యక్రమంలో చండూరు డివిజన్ శ్రీదేవి, మర్రిగూడ తాసిల్దార్ జక్కార్తి శ్రీనివాసులు, డిప్యూటీ తహసిల్దార్ నిర్మలాదేవి, ఎంపీడీవో జిసి మున్నయ్య, ఎంఈఓ శ్రీనివాసులు,మర్రిగూడ ఎస్‌ఐ ఎం కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల కార్యదర్శులు ఎన్నికల సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.