29-11-2025 01:03:11 AM
సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్
సిద్దిపేట క్రైం, నవంబర్ 28 : మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం నేరమని, విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్ సూచించారు. శుక్రవారం సిద్దిపేటలోని శ్రీచైతన్య హై స్కూల్ విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు నేర్చుకున్న ట్రాఫిక్, రోడ్డు నిబంధనలను తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. రోడ్డుకు ఎప్పుడు ఎడమ వైపు నడవాలని సూచించారు.