29-11-2025 01:01:55 AM
చారకొండ, నవంబర్ 28: పాలమూరు ప్రవాస భారతీయుల సౌజన్యంతో శుక్రవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదివేల చెస్ బోర్డులను జిల్లా రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి, మండల కార్యదర్శి నాయిని పరంజ్యోతిలు పంపిణీ చేశారు. చదరంగంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించాలని, తమ జీవన శైలిలో మెలకువలను పాటిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి సాధించాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఝాన్సీ రాణి, ఉన్నత పాఠశాల జీహెచ్ ఎం అర్జున్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.