calender_icon.png 29 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

29-11-2025 01:03:26 AM

నారాయణపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): డిసెంబర్ 1న నారాయణపేట జిల్లా, మక్తల్ పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులతో పరిశీలించి సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో పబ్లిక్ మీటింగ్ సమావేశ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, బందోబస్తుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలని, బందోబస్తు ను సెక్టార్లుగా విభజించి తగిన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.

సమావేశ స్థలంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని చెప్పారు. మీటింగ్ స్థలంలో, ఎలిప్యాడ్ స్థలం వద్ద బరికెట్స్ తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లా పోలీసుతో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చే పోలీసు ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. పార్కింగ్ ప్రాంతాలను ప్రజలు, వీఐపీల వాహనాల కోసం విడివిడిగా గుర్తించి ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఎస్పీతో పాటు డిఎస్పీ నల్లపు లింగయ్య, CI రామ్ లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, SI భాగ్యలక్ష్మి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.