01-08-2025 12:06:07 AM
నేదునూరు కనకయ్య :
* యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. సోమరులుగా మారి ఉన్నచోటే ఉండిపోతున్నారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మరికొందరు దొంగతనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. మిగిలినవారు నిరాశ, నిస్పృహల్లో బతుకుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ అబద్ధాలు కావు. పచ్చి వాస్తవాలు. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేక సామాజిక, ఆర్థిక సర్వే సంస్థలు సర్వే చేసి మరీ గణాంకాలూ వెల్లడించాయి.
భారతదేశ జనాభాలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత శాతం 27.5. భారత ప్రగతికి ఈ యువతే ఆధారం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న చైనా, అమెరికాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, మన దేశంలో యువత శాతం పెరుగుతున్నది. భారత్ ప్రస్తుతం దేశ జనాభాలో 40 శాతం యువతను కలిగిన ఉన్న దేశం. దేశ భవిష్యత్తును నిర్ణయిం చేది వారే. యువతలోని సృజనాత్మకత, ఉత్సాహం, శక్తి ఒక దేశాన్ని ముందుకు నడిపించగలవు.
అలాంటి యువ శక్తి రాజకీయాల్లోకి కూడా వస్తే బాగుంటుంది. రాజకీయ పార్టీలు దేశ, రాష్ట్ర రాజకీయా ల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం రాజకీయ పార్టీల అనుబంధ సం ఘాలైన విద్యార్థి, యువజన సంఘాల్లో యువతీ యువకులు, విద్యావంతులు కీల క బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ నిర్వహించే కార్యక్రమం, ఎన్నిక, సభలు, ధర్నాలు, పాదయాత్రలు, సమావేశాల్లో యువతే అధిక సంఖ్యలో పాల్గొం టున్నారు.
ఆ కార్యక్రమాలను జయప్రదం చేయడంలో వీరు ముందుంటున్నారు. అయితే, రాజకీయ పార్టీలు యువతను కేవలం ఓటు బ్యాంకుగా, ఓట్లను సమీకరించే కార్యకర్తలుగా మాత్రమే ఉపయోగించుకోవడం శోచనీయం. పార్టీలు ఆ పద్ధతి మార్చుకుని విద్యావంతులైన యువతను చట్టసభలకు పంపించాలి. విద్యార్థి, యువజన, కుల సంఘాల్లో పనిచేస్తున్న యువ తకు ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా, ఎన్నిక ల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి.
సీనియారిటీకీ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే జరిగి తే యువత పంచాయతీ వార్డు సభ్యుల నుంచి మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఎన్నికవుతారు. దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి ప్రజాఉద్యమం వచ్చి నా, దానిలో ముందుండి పోరాడేది యువ తే. రాజకీయ పార్టీలు యువతను కేవలం జెండాలు పట్టుకోవడానికి, నినాదాలు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిం చుకుంటే సరిపోదు. వారికి అవకాశాలూ కల్పించాలి.
50 శాతం టికెట్లు ఇవ్వాలి
తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు యువతకు, విద్యావంతులకు తప్పనిసరిగా 50శాతం సీట్లు కేటాయించాలి. పార్టీలు యువత చేసిన సేవలు, సీనియారిటీ, నిబద్ధత, ప్రజా సంబంధాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సామాజిక అం శాలు, సంక్షేమ పథకాలు, దేశ పరిస్థితులపై అవగాహన కలిగిన యువతకు చట్టసభలకు జరిగే ఎన్నికల్లో పార్టీలు టిక్కెట్లను కేటాయిస్తే, తద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది.
నిరుద్యోగ యువతకు రాజకీయ రంగంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. క్షేత్రస్థాయిలో యువతే ప్రజాప్రతినిధులైతే ప్రజ లకు సంక్షేమ పథకాలు మరింత చేరువ అవుతాయి. గ్రామాల్లో గుణాత్మక, పరిమాణాత్మక మార్పులకు బాటలపడతాయి. యువత కూడా సమాజంలో ప్రజాస్వా మ్య విలువలు పెంచేందుకు కృషి చేయాలి. ప్రగతి ఫలాలను సామాన్యుడికి చెంతకు చేర్చాలి.
యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. సోమరులు గా మారి ఉన్నచోటే ఉండిపోతున్నారు. కొందరు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మరికొందరు దొంగతనాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. మిగిలినవారు నిరాశ, నిస్పృహల కులోనై నిస్పృహ బతుకుతున్నారు. ఇంకొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇవన్నీ అబద్ధాలు కావు. పచ్చి వాస్తవాలు. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేక సామాజిక, ఆర్థిక సర్వే సంస్థలు సర్వే చేసి మరీ గణాంకాలు వెల్లడించాయి. నిరుద్యోగం కారణంగా పది మందిలో ఒకరిద్దరు యువత కుటుంబ సభ్యులు, వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నారు. అసలే బతుకు భారమంటే మళ్లీ యువత పోషణ ఆ కుటుంబాలకు కష్టంగా ఉంది.
భవిష్యత్తుకు బాటలు..
మైకెల్ గ్రీస్ అనే ప్రసిద్ధ రచయిత ‘సమాజంలో సామాజిక, రాజకీయ మార్పు లు రావాలంటే యవతే ప్రజాప్రతినిధులుగా మారాలి. రాజకీయ పార్టీలే యువత లో సానుకూల దృక్పథం కలిగించాలి. వారిని తమ అభ్యున్నతితో పాటు దేశాభివృద్ధిగా అనువుగా మలుచుకోవాలి. ఇది ఒక బలమైన ఉద్యమంగా సాగాల’ంటా డు. ఈ సూత్రాన్ని రాజకీయ పార్టీలన్నీ పాటించాలి.
రాష్ట్రంలోనూ, దేశంలోనూ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న యువత సేవలను గుర్తించాలి. పెరిగిన జనాభా వల్ల ప్రభు త్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినా, కనీసం ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేయడానికి అవకాశం కల్పించాలి. వార్డు మెంబర్, సర్పంచ్ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థు లు యువత అయితే సమాజం మరింత బాగుపడుతుంది.
యువత స్థానిక సంస్థల నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తే, అభివృద్ధికి కొత్త బాటలు పడతాయి. ఇప్పటికైనా రాజకీయా పార్టీలకు ‘నేటి యువతే భవిష్యత్తు నాయకులు‘ అనే స్పృహ కలగాలి. ఆదర్శవంతమైన భారత్ నిర్మాణం లో యువతను భాగస్వాములను చేయా లి. యువశక్తి సామర్థ్యాలతో ముందుకు సాగాలి.
యువత మెరుగైన, సుస్థిర రాజకీయాలతో నేరమయ రాజకీయాలను అడ్డుకొని సుస్థిరాభివృద్ధికి కృషి చేయాలి. ప్రగతిశీల రాజకీయాలతో ‘స్వయం సమృద్ధ’, ‘స్వావలంబన’, ‘స్వదేశీ’, ‘ఆత్మనిర్భర భారత్’ ఆవిష్కరణకు అందరూ కలిసి ఉద్యమించాలి. యువత ‘లేవండి.. మేలుకోండి, లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించకండి’ అన్న స్వామి వివేకానంద బోధనల స్ఫూర్తితో నిరంతరం ముందుకు సాగాలి. పార్టీలు యువశక్తిని అభివృద్ధి వనరుగా తీర్చిదిద్దాలి.