calender_icon.png 30 August, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత విద్య, నైతికత నాయకత్వ గుణాల కలయికతో ఎదగాలి

30-08-2025 12:43:13 AM

  జె.ఎన్.టి.యు.హెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు 

ఘట్ కేసర్, ఆగస్టు 29 : యువత విద్య, నైతికత  నాయకత్వ గుణాల కలయికతో ఎదగాలని జె.ఎన్.టి.యు.హెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ ఘనాపూర్ లోని కొమ్మూరి  ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమం ద్వారా కొత్తగా ప్రవేశించిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు కళాశాల పరిచయం చేయబడింది.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా  కే వెంకటేశ్వరరావు హాజరై విద్యార్థులకు విజ్ఞానపూరితంగా ప్రసంగించారు. యువత విద్య, నైతికత మరియు నాయకత్వ గుణాల కలయికతో ఎదగాలని, విద్యార్థులు తమ సామర్థ్యాలను గుర్తించి, ప్రపంచస్థాయిలో మార్గదర్శకులుగా ఎదగాలని ఆయన ప్రేరణ ఇచ్చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ కశ్యప్ కళాశాల యొక్క శ్రేష్ఠత, అధ్యయన విధానాలు మరియు భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ మెంబర్ డాక్టర్ జి.వి.కె. రెడ్డి, కెపిఆర్‌ఐటి చైర్మన్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, డైరెక్టర్లు డాక్టర్ బి. సుదీర్ ప్రేమ్ కుమార్, కొమ్మురి దివ్యశ్రీ సంభాషణలు నిర్వహించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.