30-08-2025 12:41:43 AM
ఎల్బీనగర్, ఆగస్టు 29 : నాగోల్ డివిజన్ లో తాగునీటి సమస్య పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ కోటా నిధులతో బోర్ వెల్ వేయిస్తున్నట్లు కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ తెలిపారు. సహభావన టౌన్ షిప్ బ్లాక్Bలో ఎంపీ ఈటల రాజేందర్ కోటాలో మంజురైన రూ.10 లక్షల నిధులతో చేపట్టిన బోర్ వెల్ పనులను శుక్రవారం కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్* ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ.. ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ నిధులతో బోరు పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
నాగోల్ డివిజన్ పరిధిలో ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టౌన్ షిప్ అసోసియేషన్ అధ్యక్షులు ఐతగోని నరేశ్, వైస్ ప్రెసిడెంట్ మారగోని స్ట్రైడర్, జనరల్ సెక్రటరీ పవన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అర్చన, ట్రెజరర్ చైతన్య, సభ్యులు మహా జబీనా, వినోద్, ప్రకాశ్, రామకృష్ణ, ఉప్పల నగేశ్, యాదగిరి, సుజన్ రాథోడ్, ఖాజా మియా, నల్ల మునీందర్ తదితరులు పాల్గొన్నారు.