12-09-2025 11:32:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వికసిత్ భారత్, వికసిత్ తెలంగాణే లక్ష్యంగా నిబద్ధతతో ముందుకు సాగుతున్న బిజెపి పార్టీని బలోపేతం చేయడం కోసం యువత బిజెపి వైపు చూస్తుంది అని బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్ దీన్ దయాళ్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హనుమకొండ న్యూ శాయంపేట ప్రాంతానికి చెందిన హిందూత్వవాది, ఎల్.ఎల్.బి. గ్రాడ్యుయేట్ కొల్లూరి ఆదిత్య సాయి ఈరోజు బిజెపిలో చేరారు. వీరికి బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మరియు బిజెపి హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.