12-08-2024 11:43:49 AM
చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు, వీరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై-తిరుత్తణి హైవేపై మొత్తం ఏడుగురు విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు వారి వాహనాన్ని ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాద వార్త తెలియగానే రెస్క్యూ టీమ్‌లు, కనగమ్మచత్తిరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను వెలికితీయడం సవాలుగా మారింది. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవేపై రెండు గంటలపాటు ట్రాఫిక్ జాం అయింది. కనగమ్మచత్తిరం పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుల్లో నలుగురు ఒంగోలు, ఒకరు తిరుపతికి చెందిన విద్యార్థులు ఉన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది.