06-01-2026 05:19:36 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసై తమ జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో అద్దం పట్టే ‘యువత జరభద్రం’ లఘ చిత్రం పోస్టర్లను మంగళవారం మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. లఘు చిత్రం సందేశం మార్గదర్శకులు గుండేటి యోగేశ్వర్, ఉత్తమ ఎన్సీసీ క్యాడెట్ నార్ల మహేందర్ దర్శకత్వంలో యువత చదువును నిర్లక్ష్యం చేస్తూ తప్పుడు స్నేహాలతో చెడు వ్యాసనలకు అలవాటు పడితే వారి భవిష్యత్తు ఎలా చెడి పోతుందో తెలిపే గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలు లాంటి మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని ఈ లఘచిత్రం ద్వారా వివరించామన్నారు. ఈ చిత్రాన్ని ‘టీ బ్రేక్’ యూ ట్యూబ్ ఛానల్ లో వీక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు ఆకాష్, అనిల్, సాగర్, చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.