నేటి బాలలే రేపటి పౌరులు

14-11-2026 | 10:18pm

నిర్మల్ ,నవంబర్, 14( విజయక్రాంతి) : నేటి బాలలే రేపటి పౌరులని కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) మాజీ పాలకవర్గ సభ్యులు ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ అన్నారు. పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకున్నారు. నెహ్రు చాచా చిత్రపటానికి పూజలు చేశారు. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. పిల్లలు బాగా చదువుకుని దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భగవతి పద్మనాభ గౌడ్. ప్రిన్సిపల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు