క్రమశిక్షణే విజయానికి పునాది

14-11-2026 | 10:29pm

గజ్వేల్, నవంబర్ 14: విద్యార్థులు(Students) చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ క్రమశిక్షణతో(Discipline) కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సెయింట్ మేరీస్ విద్యానికేతన్(St. Mary's Vidyaniketan) కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి సూచించారు. బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డితో కలిసి వేడుకలు నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల్లో(Sports competition) విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు.

షర్ట్ వేసుకుంటే మనిషికి విలువ రాదని, పుస్తకం పట్టుకుంటేనే నిజమైన విలువ వస్తుందని పేర్కొంటూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి పరిరక్షణకు మొక్కలు నాటాలని, నీరు, విద్యుత్తును పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల వికాసం కోసం పాఠశాలలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్, యోగా, కరాటే, డ్యాన్స్, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థికి పది లైబ్రరీ పుస్తకాలు అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కాటరాయప్ప విద్యార్థులతో క్రమశిక్షణ, పుస్తక పఠనం, క్రీడలపై ప్రతిజ్ఞ చేయించారు.

మరిన్ని వార్తలు