నేటి బాలలే రేపటి పౌరులు

14-11-2026 | 11:33pm

విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు

రామగిరి,నవంబర్14(విజయక్రాంతి) : రామగిరి మండలం(Ramagiri Mandal) కల్వచర్ల లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్, సెంటనరీ కాలని లో గల హిల్-ఫోర్ట్ హై స్కూల్(Hill-Fort High School) లో మరియు బేగంపేట లో గల సాయి ప్రగతి విద్యానికేతన్(Sai Pragathi Vidyaniketan) లో మన  స్వాతంత్ర భారత మొట్ట మొదటి ప్రధాని అయిన శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) గారి 138వ జన్మదిన సందర్భంగా పిల్లల దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాలల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమము ను ప్రాభించారు.

వారు ఇట్టి కార్యక్రమం ను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత దేశ భావి భారత పౌరులని వారి ఉజ్వల భవిష్యత్తు నకు చక్కటి విద్యతో పాటు నైతిక విలువలు అవసరమని అవి మా పాఠశాలల్లో వారికి అందుతున్నాయని అన్నారు. నెహ్రూ గారికి పిల్లలంటే ఇష్టమని వారి జ్ఞాపకార్థం జరుపుకునే ఈ రోజు విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం అని తెలిపారు. 

ఈ వేడుకలలో భాగంగా ప్రీ-ప్రైమరీ విద్యార్థులు ఫ్యాన్సి డ్రెస్ పోటీలలో భాగంగా  పిల్లలు వివిధ వేశాధారణలో ఆకట్టుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన కార్యక్రమం నకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్ధినీ, విద్యార్ధులకి వ్యాస రచన, చిత్ర లేఖనం, పాటల పోటీలు, ఫ్యాన్సి డ్రెస్ పోటీలను నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. 

ఈ కార్యక్రమం లో పాఠశాలల డైరెక్టర్స్  శ్రీధర్ బాబు, రంజిత్ రెడ్డి,  ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు