భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి నెహ్రూ

14-11-2026 | 10:15pm

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru). 1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించిన నెహ్రూ చిన్నతనం నుంచే దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్ష, ప్రజాస్వామ్య విలువల పట్ల గొప్ప నిబద్ధతను కలిగి ఉన్న వ్యక్తి అని రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijay Ramanarao) అన్నారు.

శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రు విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయ రమణారావు మాట్లాడుతూ  మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని అనేకసార్లు జైలు జీవితాన్నిఅనుభవించాడనీ, 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆధునిక భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు.

  శాస్త్ర సాంకేతిక రంగం, పారిశ్రామిక అభివృద్ధి, ఉన్నత విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో దేశం పురోగతి సాధించేందుకు ఆయన విశేష కృషి చేశారని,ఐఐటీలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, ప్రజాస్వామ్య వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ కార్యక్రమం లో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ధనాయక్ దామోదర్ రావు, పన్నాల రాములు, చిలుక సతీష్ , మేకల పోచం , సాయి కిరణ్ , ఏరూకొండ రమేష్ , దేవేందర్ , ముత్యాల రవీందర్ , కుమార్ కిషోర్ , అమినోద్దీన్ నన్ను పలువురు పాల్గొన్నారు...

మరిన్ని వార్తలు