పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

14-11-2026 | 10:05pm

బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు బొంగు వెంకటేశ్ గౌడ్ 

ఎల్బీనగర్, నవంబర్ 14 : వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో(Vanasthalipuram Government Hospital) రోగులకు నాణ్యమైన వైద్య సేవలు(medical services) అందించాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు బొంగు వెంకటేశ్ గౌడ్(Bongu Venkatesh Goud) కోరారు. వనస్థలిపురంలోని మహేశ్వరం ప్రభుత్వ జనరల్ దవాఖానలో(Maheshwaram Government General Hospital) రోగులకు వైద్య సేవలు అందడం లేదని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు.

ప్రసూతి విభాగంలో నిరంతర వైద్య సేవలు కల్పించాలని, రోగుల(patients) పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లకు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గర్భిణులకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, బయట మందులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.  సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... టీఎస్ఎంఐడీసీ నుంచి మందుల సరఫరా, స్థానిక కొనుగోళ్లకు నిధుల సమస్యలు ఉన్నాయన్నారు.

రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  బీసీఫ్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సీతామహాలక్షి, మద్దిమడుగు రాజశేఖర్, నూకల మల్లేశ్ యాదవ్, దినేష్ కుమార్, పందిరి వినోద్ గౌడ్, గుర్రం విజ్ఞాన్ రెడ్డి, ఎర్ర శ్రీహరి గౌడ్, గజ్జె శ్రీనివాస్ గౌడ్,  కారింగుల రవీందర్ గౌడ్, రాజనగర శ్రీకాంత్, పందుల వెంకటేశ్ గౌడ్, ఉయ్యాల కుమార్ గౌడ్, కొంగరి కృష్ణ, మామిడి గిరీష్ గౌడ్, గోరా శ్యాంసుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు