నిందితుల అరెస్టు

14-11-2026 | 10:03pm

వనస్థలిపురం చోరీ కేసులో నలుగురికి రిమాండ్ 

ఎల్బీనగర్, నవంబర్ 14 : దీపావళి పండుగ(Festival of Diwali) వేళ తాళం వేసిన చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు(Arrest by Vanasthalipuram police) చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ కరుణాకర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆరు రోజుల్లోనే చోరీ కేసు ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారినుంచి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్ర, వెండి ఆభరణాలతో(Gold, diamond, and silver jewelry) పాటు రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నేరానికి ఉపయోగించిన ఐదు సెల్ ఫోన్లు, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. నవంబర్ 8న దీపావళి పండుగ సందర్భంగా వనస్థలిపురం సచివాలయ నగర్ లోని గణేశ్ ఆలయం సమీపంలో నివసించే వికాస్ కుమార్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి తాళం వేసి, ఆటోనగర్ లో ఉన్న తన స్టీల్ దుకాణంలో నిర్వహించే దీపావళి పూజకు వెళ్లారు. రాత్రి 8.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళం పరులటి కలిపించింది.

ఇంటో పరిశీలించగా 210 గ్రాముల బంగారు ఆభరణాలు, 13 గ్రాముల వజ్రాభరణాలు, 540 గ్రాముల వెండి వస్తువులు, సుమారు రూ.10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఆటోనగర్ లోని పని ప్రదేశం నుంచి బాధితుడి వివరాలను నిందితులు ముందస్తుగా తెలుసుకుని, ఆయన నివాసాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో లేని సమయాన్ని గమనించి చోరీకి పాల్పడ్డారు.

కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితుల కదలికలను పరిశీలించారు. విశ్వసనీయ సమాచారంతో  నవంబర్ 14న తెల్లవారుజామున 5 గంటలకు వనస్థలిపురం క్రైమ్ టీమ్ ఆటోనగర్ లోని మోహన్ కాంటా వద్ద బైక్ పై వెళ్తున్న అనుమానితులను అడ్డుకుని అదుపులోకి తీసుకుంది.

విచారణలో ఈ నలుగురూ దీపావళి రోజున జరిగిన ఇంటి దొంగతనంలో పాల్గొన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాలు, వెండి ఆభరణాలు, రూ, తొమ్మిది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వనస్థలిపురం సీఐ ఎస్.రవిబాబు, డీఐ బి.రాజేశ్, ఎస్సైలు వి.రవి, డి.మల్లయ్యతో పాటు వనస్థలిపురం క్రైమ్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు