హయత్‌నగర్ లో సీసీ రోడ్డు పనులు

14-11-2026 | 10:07pm

ఎల్బీనగర్, నవంబర్ 14 : హయత్‌నగర్ పాత గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కట్టుబడి ఉందని యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్(Gajji Bhaskar Yadav, Vice Chairman of the Yadava Corporation) అన్నారు. హయత్ నగర్ బొడ్రాయి నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Government High School) వరకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.1 కోటి వ్యయంతో సీసీ రోడ్డు పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‌ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ సహకారంతో సీసీ రోడ్డు పనులకు కోటి రూపాయలు మంజూరయ్యాయన్నారు.

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని, సంక్షేమమే ప్రాధాన్యతగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో హయత్‌నగర్ డివిజన్‌తో పాటు హైకోర్టు కాలనీ, లెక్చరర్స్ కాలనీ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు