కామినేని ఆసుపత్రుల్లో అలరించిన 'కిడ్స్ ఫెస్ట్ 2026' వేడుకలు
ఎల్బీనగర్, నవంబర్ 14 : బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని కామినేని ఆసుపత్రుల(Kamineni Hospitals) ఆధ్వర్యంలో శనివారం 'కామినేని కిడ్స్ ఫెస్ట్ 2026' నిర్వహించారు. ఎల్బీ నగర్, కింగ్ కోఠి, నార్కట్పల్లి(LB Nagar, King Koti, Narketpally), విజయవాడలోని నాలుగు యూనిట్లలో నిర్వహించిన ఈ వేడుకల్లో 500 మందికి పైగా చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని ఆసుపత్రుల ఉద్యోగుల పిల్లలకు పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, డెంటిస్ట్రీ, న్యూట్రిషన్ అనే ఐదు విభాగాల్లో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
నిపుణులైన వైద్యులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత, వయసుకు తగిన జీవనశైలిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నప్పటి నుంచే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని సూచించారు. కామినేని ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. 'కామినేని కిడ్స్ ఫెస్ట్' ద్వారా కామినేని అంతా ఒకే కుటుంబం అనే విలువలను మరింత దృఢపరుస్తాయి" అన్నారు. వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలకు కాసేపు విరామమిచ్చి, తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. కార్యక్రమంలో కామినేని దవాఖాన ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.