వెలుగులు నింపుతున్న చేయూత పింఛన్లు

14-11-2026 | 10:16pm

మొయినాబాద్‌లో మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

మొయినాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి): అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను(Government welfare schemes) అమలు చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య(Chevella MLA Kale Yadaya ) అన్నారు. శనివారం మొయినాబాద్ మండల, మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. 

మండల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన 463 మంది లబ్ధిదారులకు మొయినాబాద్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 413 మంది లబ్ధిదారులకు అంజనీదేవి గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలుస్తాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లబ్ధిదారుల తరఫున ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సోనియా దర్శన్, వైస్‌చైర్మన్ గరుగు రాజు, ఎంపీడీవో హిమబిందు, కమిషనర్ జాకీర్ అహ్మద్, వార్డు కౌన్సిలర్లు, గడ్డం లక్ష్మి వెంకట్ రెడ్డి, మహేష్, జగపతి, స్వప్న సురేష్ యాదవ్, లబ్ధిదారులు, ఆయా గ్రామాల సర్పంచులు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు