అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
- 2,500 మందికి చేయూత పింఛన్ల పంపిణీ..
ఆమనగల్లు, నవంబర్ 14(విజయక్రాంతి):సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను గడపగడపకు, పారదర్శకంగా అందిస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీలక్ష్మి గార్డెన్లో అమంగల్ బ్లాక్ మండలాలకు చెందిన 2,500 మందికి 'చేయూత' పింఛన్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. త్వరలోనే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రారంభించనున్నట్లుఆయన ప్రకటించారు.
పీఏసీఎస్ అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించారు. రైతుల భాగస్వామ్యంతోనే సంఘాలు అభివృద్ధి చెందుతాయని, అన్నదాతల ఆదాయం పెంచేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. సింగల్ విండో ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులు దళారులను, ప్రతిపక్షాల అబద్ధాలను నమ్మొద్దని సూచిస్తూ.. క్వింటాలుకు రూ.2,461 మద్దతు ధర, సన్న రకాలకు రూ.500 బోనస్ ఖాతాల్లో జమ చేస్తామని, ప్రకృతి వైపరీత్య బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్డీవో శ్రీలత, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్య నాయక్, వైస్ చైర్పర్సన్ & మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యాట గీతా,
మున్సిపల్ కమిషనర్, సీఐ వెంకటేశ్వర్లు, మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కేశవులు, టీపీసీసీ సభ్యులు ఆయిల్ల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు కాలే మల్లయ్య, ఆనంద్ కుమార్, కిషన్ నాయక్, గౌని లక్ష్మమ్మ, పెంటమ్మ, బాల్ రెడ్డి, భగవన్ రెడ్డి, రాజు, సీతారాం, నిట్ట నారాయణ, ఒగ్గు వెంకటమ్మ, కండె పాండు రంగయ్య లు పాల్గొన్నారు.