నాచారం గుట్టకు పోటెత్తిన భక్తులు

14-11-2026 | 10:07pm

కార్తీక మాసం సందర్భంగా 114 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాలు

గజ్వేల్: కార్తీక మాసం(Karthika Masam) మొదటి శనివారం, ఐదో రోజు కావడంతో నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం(Sri Lakshmi Narasimha Swamy Temple) భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి నిజాభిషేకాలు, మొక్కుబడి కల్యాణాలు నిర్వహించారు.

కార్తీక మాసంలో విశేష ప్రాధాన్యత కలిగిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను 114 జంటలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. క్షేత్రం గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మరిన్ని వార్తలు