ఆగిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయాలి
జాప్యం చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి: సీపీఐ
బెజ్జంకి, విజయక్రాంతి: బెజ్జంకి మండల కేంద్రం(Bejjanki Mandal Headquarters) నుంచి బేగంపేటకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగెం మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. బెజ్జంకి బేగంపేట రోడ్డు, గుగ్గిళ్ల తంగళపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పనులు ప్రారంభించి మొరం, కంకర వేసి ఆరేళ్లు దాటినా పూర్తి చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్అండ్బీ అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఆర్అండ్బీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బెజ్జంకి గ్రామ శాఖ కార్యదర్శి కల్లూరి బాలమల్లు, నాయకుడు ఎస్. రాకేష్ పాల్గొన్నారు.