హైదరాబాద్‌లో జపాన్ సుమో రెజ్లింగ్ ఎగ్జిబిషన్

01-11-2026 | 05:00am

హైదరాబాద్, అక్టోబర్ 31: భారత్, జపాన్ మధ్య క్రీడాసంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రముఖ సంస్థ స్పోర్ట్స్ విలేజ్ స్పోర్ట్స్ ఎక్సేంజ్(Sports Village Sports Exchange) కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. జపాన్‌కు చెందిన క్రీడాసంస్థలతో భారతీయ అథ్లెట్లకు కొత్త అవకాశాలను కల్పించడమే దీని లక్ష్యం. దీనిలో భాగంగా స్పోర్ట్స్ విలేజ్ సీఈ వో మహ్మద్ షంషుద్దీన్ టోక్యోలో భారత వ్యాపారవేత్తగా రాణిస్తున్న వైకే రాజ్ గ్రూప్ అధినేత అనిల్ రాజ్‌ను కలిసి చర్చించారు.

స్పోర్ట్స్ విలేజ్ ప్రతిపాదనను మెచ్చుకున్న అనిల్ రాజ్ కావాల్సిన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య క్రీడా,సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడతాయని ఆ యన వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా హైదరాబాద్‌లో జపనీస్ సు మో రెజ్లింగ్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. జూడో శిక్షణ, జపనీస్ కోచ్‌లతో ఇక్కడ అథ్లెట్లకు కోచింగ్ శిబిరాలు ఏ ర్పాటు చేయడం ఉద్దేశమని షంషుద్దీన్ తెలిపారు. 


మరిన్ని వార్తలు