క్రీడాసంస్కృతి పెంచడమే లక్ష్యం

01-11-2026 | 05:00am
  1. గ్రామాల్లో ఎంతో నైపుణ్యముంది
  2. ఆర్థిక ఇబ్బందులే వారికి అడ్డంకులు
  3. తెలంగాణ రగ్బీ సంఘం ప్రెసిడెంట్ నరేంద్ర రామ్

సాధారణంగా క్రీడల్లో ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత వారితో ఒప్పందాల కోసం కంపెనీలు క్యూ కడుతుంటాయి. కానీ లైఫ్‌స్పాన్ అధినేత నరేంద్ర రామ్(Narendra Ram) మాత్రం దీనికి భిన్నం. సదరు ప్లేయర్ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సా ధించాలనే ఆకాంక్షతో వారికి అండగా నిలుస్తుంటారు. వ్యాపారరంగంలోకి అడుగుపెట్ట డానికి కారణం కూడా ఆ ఇష్టమే కారణమని చెబుతున్న ఆయన విజయక్రాంతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

స్వతహాగా క్రీడాకారుడిని

నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచే ఆటలపై ఎంతో ఇష్టముండేది. క్రికెట్‌లో స్కూల్ స్థాయిలో కడప జిల్లాకు ప్రాతినిథ్యం వహించా. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పలు ఈవెంట్లలోనూ జిల్లాస్థాయిలో పాల్గొన్నా. అక్కడ నుంచి సహజంగానే క్రీడల పట్ల నాకు మక్కువ మరింత పెరిగింది. క్రమేణా అది రెట్టింపవుతూ వచ్చింది. తెలంగాణలో క్రీడాకారుల కోసం ఏదైనా చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ బిజినెస్ వైపే నా అడుగులు పడ్డాయి.

ఈ వ్యాపారంతో క్రీడలకు, క్రీడాకారులకు మరింత చేరువయ్యే అవకాశముంటుందన్న ఉద్దేశంతో లైఫ్‌స్పాన్ ప్రారం భించా. ఈ కంపెనీ ఎదుగుదలతోనే పలువురు క్రీడాకారులకు అండగా నిలుస్తూ వచ్చాం. బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించా. ప్రస్తుతం షూటర్ ఇషా సింగ్‌తో బ్రాండ్ అ ంబాసిడర్ ఒప్పందాన్ని పొడిగించుకున్నాం. ఇంకా స్విమ్మర్ రిత్వికకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నా.

లాభం కోసం కాదు

తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌లోకి నా ఎంట్రీ అనూహ్యంగానే జరిగింది. రాజ్ పాకాల తప్పుకున్న తర్వాత రగ్బీ ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి ప్రతిపాదన పెట్టారు. రగ్బీతో నాకు సంబంధం లేకున్నా క్రీడాప్రేమికుడిగా వారి ప్రతిపాదనకు అంగీకరించా. తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నా. తెలంగాణలో రగ్బీని అభివృద్ధి చేసే దిశగా తొలిరోజు నుంచే అడుగులు వేసా. తొలిసారి అమ్మాయిల కోసం ట్రయల్స్ నిర్వహించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. రగ్బీ ఆటకు సరైన మౌలి క సదుపాయాలు కల్పించేందుకు భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టా. బాస్కెట్‌బాల్ లీగ్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు చేసా.

క్రీడా బడ్జెట్ పెరిగితేనే ఫలితాలు

గత కొన్నేళ్లుగా క్రీడల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగానే వ్యవహరిస్తున్నా బడ్జెట్‌ను మరింత పెంచాల్సిన అవసరముందని నా అభిప్రాయం. మౌలిక సదుపాయాలు పెం చి, గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడానైపుణ్యాన్ని వెలికితీస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి. కార్పొరేట్ కంపెనీలు పేద క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో బాధ్యత తీసుకుంటే బాగుంటుంది.

మరిన్ని వార్తలు