నల్లబండగూడెం క్రాస్ రోడ్డులో ఘనంగా నాగ పంచమి వేడుకలు
5 వేల మందికి అన్నదానం
కోదాడ నవంబర్ 14(విజయక్రాంతి) : మండలంలోని నల్లబండగూడెం క్రాస్ రోడ్డులో(Nallabandagudem Cross Road) ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పుట్ట(Subrahmanya Swamy's birthplace) వద్ద శనివారం నాగపంచమి వేడుకలు(Nag Panchami Celebrations) ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. పలువురు భక్తులు(devotees) పుట్టలో పాలు పోసి పూజలు చేశారు. కుల, మత బేధాలు లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) హాజరై పూజల్లో పాల్గొన్నారు. సుమారు 5 వేల మందికి అన్నదానం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అన్నదానంలో దీక్షా స్వాములు పాల్గొని సద్ది స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నల్లబండగూడెం గ్రామస్తులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు(devotees) పాల్గొన్నారు.