పంచాయతీలకు తాళాలు.. ప్రజలకు అందని సేవలు!

07-10-2026 | 05:00am

కార్యాలయాల్లో కనిపించని పంచాయతీ కార్యదర్శులు?

  1. పనులు కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న జనం 
  2. చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారంటూ ఆరోపణలు
  3. కార్యదర్శులు అందుబాటులో ఉండేలా చూడాలని వినతి

చివ్వెంల, అక్టోబర్ 6 : గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన గ్రామ పంచాయతీ కార్యాలయాల(Gram Panchayat offices) నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలను ప్రత్యక్షంగా సందర్శించగా, పలు కార్యాలయాలు తాళాలు వేసి కనిపించాయి. కార్యదర్శులు, సిబ్బంది(Secretaries and Staff) అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది.

 అన్ని గ్రామాలలో అదే తీరు 

మండలంలోని దాదాపు అన్ని గ్రామపంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు అప్పుడప్పుడు గ్రామాలకు వ చ్చి వెళ్లడం మినహా స్థానికంగా అందుబాటు లో ఉండడం లేదని, దీంతో గ్రామాల్లో పాల న ‘చుట్టపు చూపు’గా మారిందని ఆరోపిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు(Birth and death certificates), వివిధ సర్టిఫికెట్లు, పంచాయతీ అనుమతులు తదితర పనుల కోసం వచ్చే ప్రజలు ఒక పని కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.

యాప్‌లలో ఫొటోలు.. గ్రామాల్లో కనిపించని సేవలు

గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ యాప్లలో ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపించడానికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయి లో గ్రామాల్లో అందుబాటులో ఉండడం లే దని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. యాప్లలో ‘డిజిటల్ హాజరు(Digital Attendance)’ నమోదు అవుతున్నప్పటికీ, దాని ఫలితాలు గ్రామాల్లో ప్రజలకు అందే సేవల్లో కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ యాప్లో ఫొటోలు నమో దు చేయడం మాత్రమే కాకుండా, గ్రామా ల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఉం దని గ్రామస్థులు అంటున్నారు. డిజిటల్ న మోదులు కేవలం యాప్లకే పరిమితం కాకుం డా వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించే లా పర్యవేక్షించాలని కోరుతున్నారు.

కనీస అవసరాలపైనా ప్రభావం

పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి కనీస అవసరాలపై ప్రజలు పంచాయతీ కార్యాలయాలను ఆశ్రయిస్తారు. అయితే కార్యదర్శులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంటోందని గ్రామస్థులు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాలు, వివిధ దరఖాస్తులు, ఇతర పంచాయతీ సేవల కోసం వచ్చే ప్రజలు కార్యాలయాలు మూసి ఉండటంతో నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, కూలీలు ఒక చిన్న పని కోసం కూడా పలుమార్లు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి

గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్ణీత సమయాల్లో తెరిచి ఉండేలా, కార్యదర్శులు తమకు కేటాయించిన గ్రామాల్లో అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మం గళవారం పరిశీలనలో తాళాలు వేసి కనిపించిన కార్యాలయాలపై దృష్టి సారించి, సి బ్బంది హాజరు, విధుల నిర్వహణపై క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తు న్నారు. తాళాలు వేసిన కార్యాలయాలు, అం దుబాటులో లేని కార్యదర్శుల పరిస్థితికి ము గింపు పలికి, ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉండేలా పంచాయతీ పాలనను పటిష్టం చేయాలని పలువురు కోరుతున్నారు.                     

సకాలంలో సేవలు అందేలా చూడాలి

సమయపాలన పాటించకుండా విధులకు గైర్హాజరవుతున్న పంచాయతీ కార్యదర్శులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్ణీత పనివేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండేలా ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, పంచాయతీ సేవలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

 భాషిపంగు సునీల్,

తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

మరిన్ని వార్తలు