నెహ్రూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
నల్లబెల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆధునిక భారతదేశ నిర్మాత, స్వర్గీయ మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు (Congress Leaders) పిలుపునిచ్చారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ ఆధ్వర్యంలో నాయకులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, పంచవర్ష ప్రణాళికల (Five Year Plans) రూపకల్పనకు నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఇస్తారు శేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్లు చార్ల శివారెడ్డి, బత్తిని మల్లయ్య, మాజీ ఎంపీటీసీలు రాజారాం, వైనాల వీరస్వామి, పార్టీ నాయకులు మాసంపల్లి అఖిల్, అజ్మీర తిరుపతి, అంబరగొండ రాజు, మురారి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.