ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ చేసిన డిఐఈఓ

19-11-2026 | 07:38pm

బోథ్. నవంబర్ 19 (విజయ క్రాంతి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను(Government Junior College) ఆదిలాబాద్ జిల్లా డిఐఈఓ కైసర్ పాషాఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో రానున్న వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించారు.

మరిన్ని వార్తలు