ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

19-11-2026 | 08:07pm

మహమ్మదాబాద్,నవంబర్ 19 విజయక్రాంతి: మండల పరిధిలోని(Mandal jurisdiction) ముందలి తాండ, భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ(Indira Gandhi) 109వ జయంతిని పురస్కరించుకుని, స్థానిక సర్పంచ్ అంజ్యానాయక్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ అంజ్యానాయక్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇందిరా గాంధీ పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, భూమిలేని కుటుంబాలకు సైతం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి,వార్డు సభ్యులు అంజనేయులు పటేల్, హన్మంత్,బుగ్గిబాయి, పూన్నిబాయి, భీమ్లానాయక్,సోనిబాయి, సరోజ,గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు