ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, దివంగత ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi Birthdary) వేడుకలను గురువారం నేరేడుచర్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన వెంకటరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొణతం.చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ దేశ సమగ్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. "గరీబీ హటావో" నినాదంతో పేదరిక నిర్మూలనకు శ్రీకారం చుట్టారని, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం, భూసంస్కరణలు, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని అన్నారు. నేటి తరం నాయకులు ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి, కౌన్సిలర్లు బొలిశెట్టి లక్ష్మయ్య, అబ్దుల్ కలీం, ఇంజమూరిశ్రీకాంత్, నన్నేపంగ శ్రీను, కోఆప్షన్ సభ్యులు అలక శ్రవణ్ రెడ్డి, ఖాదర్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ బాబు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్లు చింతమల సైదులు, కోన సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ నాగయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రమాదేవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాసరెడ్డి, ప్రియాంక సైదులు, మాజీ సింగల్విండో చైర్మన్ అనంత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.