ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026 నీలమణి లోగోను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

19-11-2026 | 08:02pm

జగిత్యాల,(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 క్రీడా పోటీలకు సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం నీలమణి లోగోను ఆవిష్కరించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026లో భాగంగా వివిధ క్రీడా అంశాల్లో పోటీలను డిసెంబర్ 11 నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు, క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించడం, జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకునేందుకు యువ క్రీడాకారులకు ఈ క్రీడలు మంచి వేదికగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వంటి జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు