స్వర్గీయ ప్రధాని జయంతి వేడుకలు
19-11-2026 | 08:00pm
బోథ్. నవంబర్ 19 (విజయ క్రాంతి): సోనాల మండల కేంద్రంలో(Sonala Mandal Headquarters) స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) ఘనంగా జరుపుకున్నారు. మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.
ప్రధానిగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని ఆమెను ప్రజలు ఉక్కు మనిషిగా సంబోధిస్తున్నారు అన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతన్న రాందాస్ నరేందర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.