అంగన్వాడీల ధర్నా

19-11-2026 | 07:51pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అంగన్వాడీల సర్వే డబ్బులను వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్(Anganwadi Workers Union) ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 936 మంది అంగన్వాడీలు సర్వే(Anganwadi Survey) చేసిన సర్వే డబ్బులు ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేయకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు. వెంటనే బడ్జెట్ను కేటాయించి సర్వే డబ్బులు విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో లలిత శైలజ ప్రసాదం గంగమణి రజియా పద్మ కవిత సావిత్రి సురేష్ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు