పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు(Students) నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్(Municipal Vice Chairman MD Ahmed) అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్(District Level Electoral Literacy Clubs) వ్యాసరచన, క్విజ్ పోటీల్లో జెడ్పీఎస్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల పదో తరగతి విద్యార్థిని షిఫా నాజ్ నాలుగో ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఎండీ అహ్మద్, కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ తదితరులు ఆమెను శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవి శంకర్, ఉపాధ్యాయులు అష్రఫ్, తన్వీర్, ప్రకాష్, జవేరియా, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, సయ్యద్ నిసార్, అమర్ బిన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.