ఉచిత వృత్తి శిక్షణ కోర్సులు ప్రారంభం

19-11-2026 | 08:00pm

శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నస్పూర్ సేవాభవన్ గోదావరి ఫంక్షన్  హాల్ లో శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగుల(Singareni employees) కటుంబ సభ్యులు, సింగరేణి ప్రాంత మహిళల కోసం ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను సేవా అధ్యక్షురాలు మునిగంటి ఉమారాణి గురు వారం బ్యూటీషియన్, మగ్గం వర్క్, టైలరింగ్ & ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ సాధికారికతే లక్ష్యంగా సింగరేణి  సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సింగరేణి సేవా సమితి(Singareni Seva Samithi) ద్వారా ఏటా వివిధ వృత్తి విద్యాకోర్సులలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ మహిళల ఆర్థిక స్వావలంభనకు చేయూత నిస్తోందన్నారు. అవకాశాలు కల్పించి ప్రోత్సాహిస్తే మహిళలు అన్ని రంగాలలో రాణిస్తారని, సింగరేణి సంస్థ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని శ్రీరాంపూర్ మహిళలు సద్వినియోగపరుకోవాలని కోరారు.

కోర్సు పూర్తిచేసుకున్న తర్వాత సొంతంగా టైలరింగ్, బొటిక్, బ్యూటీపార్లర్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా మీ కటుంబాలకు చేదోడు వాదోడుగా నిలువాలని ఆకాంక్షించారు. అనంతరం గత ఆర్థిక సంవత్సరం కోర్సు పూర్తిచేసుకున్న 366 మందికి ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, ఇంచార్జీ డీజీఎం(పర్సనల్) క్రాంతి కుమార్, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు