కరువు ప్రభావిత ప్రాంతాల రైతుల వివరాల నమోదు

19-11-2026 | 08:29pm

కలెక్టర్ రాజర్షి షా

బేల నవంబర్ 19(విజయక్రాంతి): మండలంలోని చందపల్లి గ్రామ శివారంలో రైతు భరోసా యాప్‌లో(Rythu Bharosa App Enrollment) కరువు ప్రభావిత ప్రాంతాలకు చెందిన రైతుల పేర్లు, వివరాలను నమోదు చేసే ప్రక్రియను వ్యవసాయ అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా పరిశీలించారు. రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న వ్యవసాయ అధికారి సాయితేజ తో మాట్లాడి, నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. అర్హులైన రైతుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు