సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు

19-11-2026 | 08:32pm

పాపన్నపేట,నవంబరు19: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని(Indira Gandhi's Birth Anniversary) పురస్కరించుకుని గురువారం సిద్దిపేట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. కుటుంబానికి ధీమా' పథకం ప్రారంభోత్సవ సభకు పాపన్నపేట మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి 24 బస్సుల్లో నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు శ్రీధర్, సర్పంచులు శ్రీనివాస్, యాదగిరి, నగేష్, సిద్ధిరాంరెడ్డి, రజిత, రాజశేఖర్, భాగ్యమ్మ, పద్మ, సిద్ధప్ప, యేసు, శేఖర్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖలీం, కిష్టయ్య, ప్రవీణ్, ప్రసాద్, పోచయ్య, రాములు, సద్దాం, ఎల్లప్ప, సత్యనారాయణ, అంబదాస్‌తో పాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు