కేయూడీఏ కార్యాలయం కాళోజీ కళాక్షేత్రంలోకి తరలింపు

19-11-2026 | 08:27pm

హనుమకొండ,(విజయ,క్రాంతి): హనుమకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) కార్యాలయాన్ని బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం రెండవ, మూడవ అంతస్తు లోకి తరలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి సందర్శించారు. కార్యాలయ తరలింపు అనంతరం కుడా లోని విభాగాలను పరిశీలించారు. నేటి నుంచి కాళోజి  కళాక్షేత్రంలోని కుడా కార్యాలయం నుండి అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు