విద్యార్థులు సేవాభావం, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలి

19-11-2026 | 08:20pm

స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిరం ముగింపు వేడుకల్లో జీఎం ఏ రాజేశ్వర్ రెడ్డి

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జీఎం

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): విద్యార్థులు సేవాభావం, క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి(Singareni Bhupalpally Area General Manager A. Rajeshwar Reddy) అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పయోనీరింగ్ అండ్ క్యాంప్ క్రాఫ్ట్ శిక్షణ శిబిరం(Pioneering and Camp Craft Training Camp) ముగింపు వేడుకలలో జీఎం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మూడు రోజుల పాటు పొందిన శిక్షణలో భాగంగా వెదురు కర్రలు, తాళ్ల సహాయంతో రూపొందించిన వివిధ నిర్మాణాలు వాచ్ టవర్, క్యాంప్ క్రాఫ్ట్ నమూనాలను జీఎం పరిశీలించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా జీఎం స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

అనంతరం క్యాంప్ క్రాఫ్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులందరికి జీఎం చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయికృష్ణ, ఏ‌ఎస్‌ఓసికలు సాయి నిరంజన్, సుధాకర్, లీడర్ ఆఫ్ ద కోర్స్ శక్తికుమార్, శ్రీనివాస రావు, స్వామి, రాజమౌళి, రమేశ్, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు