ఈ నెల 25న ఇసుక బహిరంగ వేలం..
19-11-2026 | 08:27pm
పాపన్నపేట,నవంబరు19: మండల పరిధిలోని నాగ్సాన్పల్లి గ్రామ(Nagsanpalli village) శివారులో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న సుమారు 13 ట్రాక్టర్ల ఇసుకను ఈ నెల 25న బహిరంగ వేలం వేయనున్నట్లు పాపన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్ తెలిపారు. 25న ఉదయం 11 గంటలకు నాగ్సాన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనే ఆసక్తి గల వారు రూ.10 వేల డీడీని 'తహసీల్దార్ పాపన్నపేట ' పేరిట తీసి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా డీడీ సమర్పించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.