చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే గండ్ర
19-11-2026 | 08:21pm
గణపురం,(విజయక్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన శ్రీ బాలాజీ ఐరన్ హార్డ్ వేర్ నిర్వాహకులు ఆవుల రజిత, కిరణ్ దంపతుల కుమార్తె చైత్ర నూతన వస్త్ర పల పుష్పాలంకరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao ) పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి భాస్కరరావు, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి చోటె మియా సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, దూడపాక శంకరయ్య, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మామిండ్ల మల్లికార్జున గౌడ్ బత్తిని శివశంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.