ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్
ఘట్ కేసర్, నవంబర్19 (విజయ క్రాంతి) : స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi) దేశానికి చేసిన సేవలు మరువలేనివని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. గురువారం స్వర్గీయ ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఘట్ కేసర్ పట్టణంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, విచ్చేసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందిరాగాంధీ గలీబ్ హటావో నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఆదుకుందన్నారు.
ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. అలాగే ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈకార్యక్రమంలో రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు మచ్ఛేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ఉపాధ్యక్షులు సార శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ ఖయ్యూం, మీసాల సుధాకర్ రావు,
కందకట్ల మాధవరెడ్డి, అధికార ప్రతినిధి కొత్తకొండ వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనూజ నాయక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫారుక్,
మాజీ సర్పంచ్ మేడపైన వెంకటేష్, మాజీ కౌన్సిలర్లు కడపోల్ల మల్లేష్, కుతాడి రవీందర్, కార్యదర్శులు మేకల సునీల్ కుమార్, కడపోల్ల రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోక మల్లేష్, సీనియర్ నాయకులు ఉల్లి ఆంజనేయులు యాదవ్, బొక్క సుధాకర్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, బొక్క సత్తిరెడ్డి, కె. నర్సింగరావు, రహీం, బద్రి, తదితరులు పాల్గొన్నారు.