ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
19-11-2026 | 08:32pm
చిట్యాల,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి(Former PM Indira Gandhi Birthday) సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీ(Chitya Municipality) పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మి సైదులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోకల దేవదాసు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.