సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో పురుషుల దినోత్సవం
జగిత్యాల,(విజయక్రాంతి): ప్రతి కుటుంబం వెనుక నిశ్శబ్దంగా నిలబడే మూల స్తంభం పురుషుడేనని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్(Telangana All Senior Citizens Association) జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం(International Mens Day)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 16 మంది సీనియర్ సిటిజెన్లను హరి అశోక్ కుమార్ అసోసియేషన్ మెమంటోలు అందించి సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను ప్రస్థావిస్తూ మహిళల భద్రత కు ప్రత్యేక హెల్ప్ లైన్ ఉన్నట్లే పురుషుల భద్రతకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను తమిళనాడు పురుషుల భద్రత సంఘాలు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. హన్మంత్ రెడ్డి, మైనారిటీ నేత ఎం. డి. యాకూబ్, వివిధ సంఘాల ప్రతినిధులు వి. ప్రకాష్ రావు, బ్రహ్మయ్య, ఉమ్మడి జిల్లా యువజన జేఏసీ అధ్యక్షులు ధోనూరి భూమాచారి తదితరులు పాల్గొన్నారు.