ఫుడ్ సెక్యూరిటీ పుస్తకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

19-11-2026 | 08:12pm

బేల,(విజయక్రాంతి): బేల మండలం(Bela mandal)లోని చాంద్‌పల్లి గ్రామాన్ని(Chandpalli Village) జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) సందర్శించారు. ఈ సందర్భంగా ఫుడ్ సెక్యూరిటీ అండ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్‌(Food Security and Conservation Project)కు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్‌ను పరిశీలించి, వివిధ రకాల వస్తువులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తిలకించారు. అనంతరం రైతులతో కలిసి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు