కాజిపేట సోమిడిలో ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభం

19-11-2026 | 08:11pm

హనుమకొండ, నవంబర్ 19(విజయ క్రాంతి):కాజిపేట సోమిడి 62వ డివిజన్‌లో(Somidi 62nd Division) ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ తో(PACS Chairman Gangula Srinivas) కలిసి తాజా మాజీ  కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్(Former Corporator Jakkula Ravinder Yadav) రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం వల్ల రైతులు పండించిన పంటను సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ, రాబోయే కాలంలో మరింతగా ధాన్యం ఉత్పత్తి చేయాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెరుగు రాజయ్య యాదవ్,కాయిత రాజ్‌ కుమార్ యాదవ్,దోమ లింగ రెడ్డి,బుర్ర బాబురావు , చల్ల వాసుదేవ రెడ్డి,గుంటి కుమార్, దోమ గాల్ రెడ్డి, బుల్లి కొండ వెంకటేష్,మంతుర్తి బొంద్యాలు, పాలడుగుల ఆంజనేయులు, బోయిని బిక్షపతి, బైరబోయిన రమేష్, రాజు, బోయిని రాజ్ కుమార్,  భోల్లికుంట శ్రీనివాస్, మిరియాల కట్టయ్య, , పాశం రాజి రెడ్డి,  కుమ్మరి నీలక్క, జై రావు రజియా, పాలడుగుల అనిల్, కాయిత రాజు,మంతుర్తి మహేందర్, బోయిని రాజకుమార్, బుల్లి కొండ యాదగిరి, రాంకీ, సుధీర్, శేఖర్, రాజు,మేకల కుమార్, సకినాల పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు