నేరేడుచర్ల విద్యుత్ ఏఈ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు
19-11-2026 | 07:42pm
ప్రారంభించిన సూర్యాపేట ఎస్.ఈ, వై. యాదగిరి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం, ఆపరేషన్ - నేరేడుచర్ల సెక్షన్‌ను దిర్శించర్ల 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లోని నూతన కార్యాలయంలోకి మార్చారు. నూతన కార్యాలయాన్ని సూర్యాపేట ఎస్ఈ (ఆపరేషన్) వై.యాదగిరి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఏడీఈ (ఆపరేషన్) ఎల్.సి. గోపయ్య, నేరేడుచర్ల ఇన్చార్జి ఏఈ భూక్యా వెంకటేశ్వర్లు, ఇతర మండలాల ఏఈలు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.